Thursday, November 8, 2012

తీరం తాకని కెరటం

కనులు ఉన్నా, కనిపిస్తున్నా,
వెలుగు చూడని చీకటివైతే...

కారు మబ్బుల జలనిధి ఉన్నా,
తెమ్మెర తాకని మేఘానివైతే...

గమ్యం చేర్చే చుక్కానీ వున్నా,
దరి చేరని నావవైతే...

సముద్రమంత ఉత్సాహం వున్నా,
తీరం తాకని కెరటానివైతే

రెప్పల మాటున రంగుల స్వప్నాలున్నా,
నిదుర కరువైన మెలుకువవైతే... 

మనసు పలికే కమ్మని రాగాలున్నా,
పెదవి దాటని మౌనానివైతే...

ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నా,
నిరంతరం వేధించే గతానివైతే...